విశాఖ అమ్మాయి...అమెరికా అబ్బాయి
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:59 AM
విశాఖ అమ్మాయి, అమెరికా అబ్బాయి ...సింహాచలం అప్పన్న సాక్షిగా ఒక్కటయ్యారు.
సింహాచలం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖ అమ్మాయి, అమెరికా అబ్బాయి ...సింహాచలం అప్పన్న సాక్షిగా ఒక్కటయ్యారు. వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన వర్షిక బిహేవియరల్ (ఆటిజం) సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఆరు నెలల క్రితం ఆమె అమెరికాలోని కొలంబియాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరారు. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న జెరెట్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. దీంతో ఇరువురూ పెద్దలను చెప్పి, పెళ్లికి ఒప్పించారు. శనివారం సింహగిరిపై వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గజపతి సత్రంలో హైందవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.