నామినేషన్ల వెల్లువ
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:44 AM
జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది.
మూడో దశ పంచాయతీ పోరుకు ముగిసిన గడువు
అత్యధికంగా మాకవరపాలెం మండలంలో దాఖలు
సర్పంచ్ పదవులకు 207, వార్డులకు 1042 నామినేషన్లు
అనకాపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. డిసెంబరు 2న జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో మొత్తం 216 సర్పంచ్ స్థానాలకుగాను, 2,046 వార్డు స్థానాలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. చివరి రోజు కావడంతో సోమవారం మండల, పంచాయతీ కేంద్రాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులతో సందడి వాతావరణం నెలకొంది. మండలాల వారీగా అనకాపల్లి మండలంలో రెండు సర్పంచ్ స్థానాలకు 8 నామినేషన్లు, 16 వార్డులకు 24 నామినేషన్లు అందాయి. నర్సీపట్నంలో 12 సర్పంచ్ స్థానాలకు 58 నామినేషన్లు, 124 వార్డులకు 355, చీడికాడలో 23 సర్పంచ్ స్థానాలకు 145 నామినేషన్లు, 222 వార్డులకు 667, దేవరాపల్లి మండలంలో 27 సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు, 258 వార్డులకు 880, కె.కోటపాడులో 32 సర్పంచ్ స్థానాలకు 173 నామినేషన్లు, 292 వార్డులకు 770, మాడుగులలో 29 సర్పంచ్ స్థానాలకు 198 నామినేషన్లు, 282 వార్డులకు 887, గొలుగొండలో 27 సర్పంచ్ స్థానాలకు 168 నామినేషన్లు, 260 వార్డులకు 794, మాకవరపాలెంలో 31 సర్పంచ్ స్థానాలకు 207 నామినేషన్లు, వార్డులకు 1,042, నాతవరం మండలంలో 33 సర్పంచ్ స్థానాలకు 142 నామినేషన్లు, 304 వార్డులకు 665 నామినేషన్లు దాఖలయ్యాయి.