నామినేషన్ల వెల్లువ
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:31 AM
జిల్లాలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
79 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 458
అత్యధికంగా పాలవలస పంచాయతీలో 17
రెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి ఒక్కటే...
ఏకగ్రీవం దిశగా మరో నాలుగు పంచాయతీలు
802 వార్డులకు 2430 మంది
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు (పద్మనాభం, భీమునిపట్నం, ఆనందపురం, పెందుర్తి) మండలాల్లో గల 79 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 458 మంది, 802 వార్డు సభ్యుల పదవులకు 2,430 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసింది. చివరిరోజు సర్పంచ్ పదవులకు 179 మంది, వార్డులకు 1,087 మంది నామినేషన్లు వేశారు. సోమవారం ఆనందపురం మండలంలో సర్పంచ్ పదవులకు 53, వార్డులకు 300, భీమిలి మండలంలో సర్పంచులకు 31, వార్డులకు 241, పద్మనాభం మండలంలో సర్పంచులకు 37, వార్డు లకు 284, పెందుర్తి మండలంలో సర్పంచ్ పదవులకు 58 మంది, వార్డులకు 262 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ పదవులకు మూడు రోజుల్లో దాఖలైన నామినేషన్లు పరిశీలిస్తే...ఆనందపురం మండలంలోని 26 పంచాయతీల్లో కలిపి 153, భీమిలి మండలంలోని 16 పంచాయతీల్లో 77, పద్మనాభం మండలంలోని 22 పంచాయతీల్లో 111, పెందుర్తి మండలంలోని 15 పంచాయతీల్లో 117 మంది నామినేషన్లు వేశారు. వార్డులకు ఆనందపురం మండలంలో 766, భీమిలి మండలంలో 498, పద్మనాభం మండలంలో 666, పెందుర్తిమండలంలో 500 మంది నామినేషన్లు వేశారు. జిల్లాలో పెద్ద పంచాయతీల్లో ఒకటైన పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవం కానున్నది. అత్యధికంగా సర్పంచ్ పదవికి ఆనందపురం మండలం పాలవలసలో 17, శొంఠ్యాంలో 16, వేములవలసలో 12, పెందుర్తి మండలం గుర్రంపాలెంలో 13, గొరపల్లిలో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆనందపురం మండలం శిర్లపాలెం, గొట్టిపల్లి, కుశలవాడ పంచాయతీలు ఏకగ్రీవం కోసం ఇప్పటికే వేలంపాట నిర్వహించి గ్రామస్థుల ఆమోదం తెలిపారు. భీమిలి మండలం లక్ష్మిపురం, పద్మనాభం మండలం విలాస్కానివానిపాలెం, కృష్ణాపురం పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం దాదాపు గ్రామస్థులు ముందుకు వచ్చారు. కాగా మంగళవారం నామినేషన్ల పరిశీలన చేస్తామని డీపీవో శ్రీనివాసరావు తెలిపారు.
మండలం పంచాయతీలు సర్పంచ్ పదవికి వార్డులు దాఖలైన
దాఖలైన నామినేషన్లు నామినేషన్లు
1. పద్మనాభం 22 111 226 666
2. భీమిలి 16 77 166 498
3. ఆనందపురం 26 153 260 766
4. పెందుర్తి 15 117 150 500
మొత్తం 79 458 802 2,430