Share News

ఆర్టీసీకి పండుగ!

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:22 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రయాణికుల నుంచి అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోలకు రూ.4 కోట్ల 68 లక్షల 83 వేల ఆదాయం లభించిందని డీపీటీవో వి.ప్రవీణ చెప్పారు. గురువారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, అనకాపల్లి డిపోకి రూ.2,36,12,000, నర్సీపట్నానికి రూ.2,32,71,000 ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఆర్టీసీకి పండుగ!
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

సంక్రాంతికి రూ.4.68 కోట్ల ఆదాయం

అనకాపల్లి డిపోకి రూ.2,36,12,000, నర్సీపట్నానికి రూ.2,32,71,000 రాబడి

శత శాతం దాటిన ఓఆర్‌

19వ తేదీన రికార్డుస్థాయిలో 132 శాతం ఓఆర్‌

అనకాపల్లి టౌన్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రయాణికుల నుంచి అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోలకు రూ.4 కోట్ల 68 లక్షల 83 వేల ఆదాయం లభించిందని డీపీటీవో వి.ప్రవీణ చెప్పారు. గురువారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, అనకాపల్లి డిపోకి రూ.2,36,12,000, నర్సీపట్నానికి రూ.2,32,71,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా అనకాపల్లి డిపో నుంచి నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.13.23 లక్షలు, నర్సీపట్నం డిపో నుంచి నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.19.36 లక్షల ఆదాయం లభించిందన్నారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం, విజయవాడకు, నర్సీపట్నం డిపో నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్‌లకు ప్రత్యేక బస్సులు నడిపినట్టు చెప్పారు. 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అనకాపల్లికి 109 శాతం ఓఆర్‌ రాగా, నర్సీపట్నానికి 97 శాతం ఓఆర్‌ వచ్చిందన్నారు. రెండు డిపోలకు కలిపి ఈ నెల 19న అత్యధికంగా ఓఆర్‌ 132 శాతం నమోదైందని వివరించారు. ఆ రోజు 1,11,015 మంది ప్రయాణించారని ఆమె వెల్లడించారు.

అనకాపల్లి, నర్సీపట్నం డిపోలకు పార్శిల్‌ రవాణా ఆదాయం లక్ష్యం రూ.2.38 కోట్లుకాగా డిసెంబరు చివరినాటికి రూ.1.84 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనకాపల్లి డిపో లక్ష్యం రూ.1.45 కోట్లు కాగా ఇంతవరకు రూ.93 లక్షలు వచ్చిందన్నారు. పార్శిల్‌ డోర్‌ డెలివరీలో అనకాపల్లి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో ఉందని ఆమె చెప్పారు. త్వరలో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, వీటికోసం ఎలమంచిలి, చోడవరం ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని డీపీటీవో ప్రవీణ తెలిపారు.

నర్సీపట్నం డిపోకి పుష్కలంగా ఆదాయం

నర్సీపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమయంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలతో నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి ఆదాయం పుష్కలంగా వచ్చింది. వచ్చింది. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, మళ్లీ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి నడిచాయి. నర్సీపట్నం నుంచి విశాఖపట్నం, తుని రూట్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. 10 తేదీన రూ.20.8 లక్షలు, 11వ తేదీన 17.21 లక్షలు, 12వ తేదీన రూ.19.63 లక్షలు, 14వ తేదీన 16.76 లక్షల ఆదాయం వచ్చింది. సంక్రాంతి, కనుమ పండగ కారణంగా 15, 16 తేదీల్లో సాధారణ ఓఆర్‌ నమోదైంది. 15వ తేదీన రూ.10. లక్షలు, 16వ తేదీన రూ.10.22 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. తర్వాత 17వ తేదీ నుంచి తిరుగు ప్రయాణికులతో రద్దీ పెరిగింది. 17వ తేదీన రూ.17.3 లక్షలు, 18వ తేదీన రూ.16.42 లక్షలు, 19వ తేదీన అత్యధికంగా రూ.24.34 లక్షలు, 20వ తేదీన రూ.20.96 లక్షలు, 21న తేదీన రూ.21.76 లక్షల ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగకు ముందు 34, పండుగ తరువాత 20 చొప్పున మొత్తం 54 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.16,09,151 అదనపు రాబడి వచ్చింది. ఇందులో పండుగకు ముందు రూ.9,14,752, పండుగ తర్వాత రూ.6,64,399 వచ్చిందని డిపో మేనేజర్‌ ధీరజ్‌ తెలిపారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో 58 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.12,11,728 ఆదాయం రాగా ఈ సంవత్సరం 54 ప్రత్యేక సర్వీసులతోఓ రూ.16,09,151 ఆదాయం వచ్చిందని తెలిపారు.. గత ఏడాదితోపోలిస్తే రూ.3,97,423 అధిక ఆదాయం వచ్చిందన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:22 AM