నయనమనోహరం
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:04 AM
పద్మనాభంలోని అనంతపద్మనాభస్వామి కొండపై నిర్మించిన ఘాట్‌రోడ్డు హరివిల్లులా దర్శనమిస్తూ చూపరులను కట్టిపడేస్తోంది. అనంతపద్మనాభస్వామి ఆలయానికి గతంలో ఘాట్‌రోడ్డు నిర్మించారు. తాజాగా ఆరోడ్డు మలుపులు (ఎయిర్‌బెండ్)ల వద్ద ఆధ్యాత్మికత, ప్రకృతిరమణీయతను ప్రతిబింబించేలా రంగురంగుల చిత్రాలను ఆవిష్కరించారు. దీంతో అనంతపద్మనాభస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతోపాటు కొండపై నుంచి ప్రకృతిని ఆస్వా దించే పర్యాటకులు ఘాట్‌రోడ్డుపై ప్రయాణిస్తూ ఒకవైపు ఒంపులు తిరుగుతూ కనిపించేరోడ్డు, ఇరువైపులా పచ్చనిపంటపొలాలు, కొండలతో కూడిన ప్రకృతిరమణీయతను ఆస్వాదిస్తున్నారు.
హరివిల్లును తలపించేలా పద్మనాభం ఘాట్ రోడ్డు

-విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి