Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:12 AM

మేహాద్రిగెడ్డ కాలువ ఇద్దరు విద్యార్థులను బలిగొంది. స్నేహితులతో కలిసి జలాశయం అందాలను వీక్షించేందుకు వెళ్లి, ఈత సరదాతో కాలువలోకి దిగిన వారిలో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి... ఎన్‌ఏడీ కూడలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం మధ్యా హ్నం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను తిలకించేందుకు వచ్చా రు. వారిలోని ఐదుగురు జలాశయం శివారు కాలువలో ఈత కొట్టేందుకు దిగారు. కేరింతలు కొడుతుండగానే రామచంద్రరావు (18), గంటా దీపక్‌ (17) నీటిలో మునిగిపోయారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు మృతి

మేహాద్రిగెడ్డ వద్ద విషాదం

గోపాలపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

మేహాద్రిగెడ్డ కాలువ ఇద్దరు విద్యార్థులను బలిగొంది. స్నేహితులతో కలిసి జలాశయం అందాలను వీక్షించేందుకు వెళ్లి, ఈత సరదాతో కాలువలోకి దిగిన వారిలో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి... ఎన్‌ఏడీ కూడలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం మధ్యా హ్నం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను తిలకించేందుకు వచ్చా రు. వారిలోని ఐదుగురు జలాశయం శివారు కాలువలో ఈత కొట్టేందుకు దిగారు. కేరింతలు కొడుతుండగానే రామచంద్రరావు (18), గంటా దీపక్‌ (17) నీటిలో మునిగిపోయారు. దీంతో స్నేహితులు గగ్గోలుపెడుతూ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తరువాత మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వారి వివరాలు వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు సీఐ సతీశ్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం సమీపంలోని పాత గోశాల ప్రాంతానికి చెందిన మృతుడు గంటా దీపక్‌ తండ్రి అప్పలరాజు సింహాచలం కొండపైన దుకాణం నిర్వహిస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన మృతుడు గన్నవరపు రామచంద్ర తండ్రి లక్ష్మీగణపతి శర్మ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమారులను పోగొట్టుకున్న ఇరు కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి.

Updated Date - Jul 20 , 2026 | 01:12 AM