Share News

బోసిపోయిన రైల్వే స్టేషన్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:39 AM

ఏడాది పొడవునా రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం బోసిపోయింది. గోదావరి, గరీబ్‌రథ్‌, తిరుమల, రత్నాచల్‌, వందేభారత్‌, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220) వంటి పలు ప్రధాన రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది.

బోసిపోయిన రైల్వే స్టేషన్‌

ప్రధాన రైళ్లు రద్దుతో కనిపించని

ప్రయాణికుల సందడి

నేడు పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

ఏడాది పొడవునా రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం బోసిపోయింది. గోదావరి, గరీబ్‌రథ్‌, తిరుమల, రత్నాచల్‌, వందేభారత్‌, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220) వంటి పలు ప్రధాన రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. జన్మభూమి, సింహాద్రితోపాటు సంత్రాగచ్చి-చెన్నై వంటి దూర ప్రాంత రైళ్లు నడిచినా తుఫాన్‌కు భయపడి అనేకమంది ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా మంగళవారం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన గోదావరి, గరీబ్‌రథ్‌ వంటి ప్రధాన రైళ్లను రద్దు చేయడంతో బుధవారం ఉదయం అయితే స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. అలాగే హౌరా మెయిల్‌ (12840), చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), చెన్నై-షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (18042), బిలాస్‌పూర్‌-తిరుపతి (17481) వంటి అనేక రైళ్ల రీ షెడ్యూల్‌ ప్రభావం కూడా రైల్వే స్టేషన్‌పై పడింది. రద్దైన రైళ్ల ప్రయాణికులతోపాటు రీషెడ్యుల్‌ కావడంతో ప్రయాణాన్ని విరమించుకున్న ఆన్‌లైన్‌ టికెట్‌దారులు ఇంటికే పరిమితం కాగా, కౌంటర్‌ టికెట్‌ పొందినవారు స్టేషన్‌కు చేరుకుని అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో సొమ్ము వాపసు తీసుకున్నారు.

నేడు పలు రైళ్లు రద్దు

గురువారం భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12703), విశాఖ-పార్వతీపురం ప్రత్యేక రైలు (07268), విశాఖ-రాజమండ్రి మెము (67286) రైళ్లను కూడా రద్దు చేశారు.

Updated Date - Oct 29 , 2026 | 01:39 AM