జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుల పంట
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:15 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుల పంట
ఓపెన్ కేటగిరీలో పెందుర్తి విద్యార్థినికి
తొమ్మిదో ర్యాంకు
మరో 20 మందికి 500లోపు ర్యాంకులు
వివిధ కేటగిరీల్లో తొమ్మిది మందికి వందలోపు ర్యాంకు
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
ఐఐటీలు/తత్సమాన విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నగర విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు గత నెల మూడో తేదీన అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు సోమవారం విడుదల చేశారు. నగరంలోని శ్రీచైతన్య, నారాయణ, ఎసెంట్, శ్రీవిశ్వ, తదితర కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సుమారు 500 మంది సీట్లు సంపాదించుకునే ర్యాంకులు సాధించారు. పెందుర్తి ప్రాంతానికి చెందిన ఎం.నాగసహర్ష జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. శ్రీచైతన్య విద్యాసంస్థలో ఇంటర్ చదివిన నాగ సహర్ష ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇంకా కె.హిమఖర్ 40వ ర్యాంకు, వి.అవినాష్‌నాయుడు 95, ఎ.రోహిత్ 102, కె.శ్రావ్య 111, ఎం.సుధీర్‌కుమార్ 154, బి.ధీరజ్ 213, కె.కనిష్క 221, సీహెచ్‌వీ సాయిధనుష్ 224, ఆర్.సాయిసహిత 230, పి.దీపక్‌చంద్ర 264, పి.భార్గవనాయుడు 270, గోవింద పాండే 276, వి.తరుణ్‌సాయి 306, బి.సాయిచరణ్ 352, పి.సాయిచేతన్ 389, ఎ.నరేంద్ర 435, జి.సూర్యవివేక్‌నాయుడు 475 ర్యాంకు సాధించారు. ఇంకా వివిధ కేటగిరీల్లో 14, 30, 33, 36, 38, 62, 74, 93, 95 ర్యాంకులు వచ్చాయి.