మెచ్చదగ్గ సంకల్పం
ABN , Publish Date - May 06 , 2026 | 12:43 AM
మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి మారుమూల మెచ్చగుడ గ్రామానికి వంతెన లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లతరబడి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వంతెన లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లడం కష్టంగా ఉంది. డోలీల్లో తరలిస్తున్నా సకాలంలో వైద్యం అందక చాలా మంది మృతి చెందారు.
అనకాపల్లి నుంచి చర్లపల్లికి (సికింద్రాబాద్ సమీప) ఈ నెల ఎనిమిదో తేదీన ప్రత్యేక ఏసీ ఎక్స్‌ప్రెస్ నడవునున్నది. 17054 నంబరుతో శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.
- ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోయినా వంతెన నిర్మించాలని నిర్ణయం
- చందాలు వేసుకుని శ్రమదానం చేస్తున్న మెచ్చగుడ గ్రామస్థులు
అరకులోయ, మే 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి మారుమూల మెచ్చగుడ గ్రామానికి వంతెన లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లతరబడి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వంతెన లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లడం కష్టంగా ఉంది. డోలీల్లో తరలిస్తున్నా సకాలంలో వైద్యం అందక చాలా మంది మృతి చెందారు. దీంతో గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.10 లక్షలు పోగు చేశారు. వారంతా శ్రమదానంతో వంతెన నిర్మించుకుంటున్నారు. రెండు రోజులుగా రాత్రి వేళ కూడా పని చేసి వంతెనకు శ్లాబ్ వేసేందుకు రాడ్ బెండింగ్ పనులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం శ్లాబ్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వీరి సంకల్పాన్ని పలువురు అభినందిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామస్థులకు తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.