పర్యాటకుల తాకిడి
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:11 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పెరిగిన పర్యాటకుల సంఖ్య
చింతపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపారు. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో పాల్గొన్నారు. యర్రవరం జలపాతాన్ని కూడా సందర్శించారు.
అరకులోయలో...
అరకులోయ : అందాల అరకులోయలో ఆదివారం పర్యాటకులు సందడి కనిపించింది. శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు రాగా, బంద్ కారణంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించలేదు. హోటళ్లలో బస చేసి ఆదివారం పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి, సుంకరమెట్టలోని పురాతన చర్చిని సందర్శించి ఫొటోలు దిగారు. పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా కనిపించింది.