Share News

మన్యంలో చలి పులి

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:52 PM

మారుతున్న వాతావరణం నేపథ్యంలో మన్యాన్ని చలి వణికిస్తున్నది. ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్లు సరిగా కనిపించడం లేదు.

మన్యంలో చలి పులి
ముంచంగిపుట్టులో ఉదయం 8గంటల సమయంలో మంచు కారణంగా చంద్రుడులా దర్శనమిస్తున్న సూర్యుడు

పది గంటల వరకు దట్టంగా పొగమంచు

లైట్లు వేసుకొని వాహనదారుల రాకపోకలు

పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):

మారుతున్న వాతావరణం నేపథ్యంలో మన్యాన్ని చలి వణికిస్తున్నది. ఏజెన్సీలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్లు సరిగా కనిపించడం లేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం దట్టంగా మంచు.. మఽధ్యాహ్నం ఒక మోస్తరు ఎండ.. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలవుతున్నది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం కొయ్యూరులో 18.9, పాడేరులో 17.9, చింతపల్లిలో 16.6, జి.మాడుగులలో 16.1, అరకులోయలో 15.9, డుంబ్రిగుడలో 15.4, పెదబయలులో 14.5, ముంచంగిపుట్టులో 14.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెరిగిన చలితీవ్రత

ముంచంగిపుట్టు: మండల పరిధిలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. శుక్రవారం ముంచంగిపుట్టులో ఉదయం 8 గంటల వరకు మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో మంచుతెరల నడుమ సూర్యుడు చందమామలా దర్శనమిచ్చాడు.సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రజలను భయపెడుతోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు స్పెట్టర్స్‌, ఉన్ని దుస్తులు, తదితర ఉన్ని దుస్తులను ఉపయోగిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో చలిమంటలు కాగుతున్నారు.

సీలేరులో..

సీలేరులో శుక్రవారం దట్టంగా మంచు కురిసింది. ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. మంచు దృశ్యాలు చూపరుకు కనువిందు చేశాయి.

Updated Date - Nov 13 , 2026 | 10:52 PM