Share News

మానవ సేవకు శతాబ్దం

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:15 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మానవ సేవకు శతాబ్దం

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలల ఆధ్వర్యంలో నేడు ఏయూ శతాబ్ది ఉత్సవాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘సైన్స్‌ ఆవిష్కరణలు, ఆరోగ్యం, జీవన విజ్ఞానం, మానవసేవకు శతాబ్దం’ అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ హాజరుకానుండగా, ప్రత్యేక అతిథిగా నానో అండ్‌ సాఫ్ట్‌ మ్యాటర్‌ సైన్సెస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎల్‌వీ ప్రసాద్‌ పాల్గొననున్నారు. విశిష్ట అతిథులుగా ఏపీ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ డైరెక్టర్‌ ఎం.పాండురంగప్రసాద్‌, లీడర్‌షిప్‌ కన్సల్టెంట్‌ కేవీ రాజు పాల్గొననున్నారు. సదస్సుకు చీఫ్‌ ప్యాట్రన్‌గా వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ వ్యవహరించనున్నారు. ఈ వేడుకలు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పరిశోధన, అకడమిక్‌ ప్రదర్శన, ప్రముఖుల ప్రసంగాలు, పదవీ విరమణ చేసిన అఽధ్యాపకుల ప్రసంగాలు, సన్మానాలు, చర్చలు శతాబ్ది అవార్డుల ప్రదానం ఉంటాయి.

Updated Date - Apr 21 , 2026 | 01:15 AM