Share News

మన్యంపై మంచు దుప్పటి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:34 AM

మన్యంలో సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు దట్టంగా కురిసింది.

మన్యంపై మంచు దుప్పటి
పాడేరు మెయిన్‌రోడ్డులో సోమవారం ఉదయం పొగమంచు

కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గని చలి

పాడేరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు దట్టంగా కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రస్తుతం పొగమంచు దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఉదయం వేళల్లో అప్రమత్తంగా వాహనాలను నడపాలని భారత వాతావరణ సంస్ధ సూచిస్తున్నది.

అరకులోయలో 13.0 డిగ్రీలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం అరకులోయలో 13.0, ముంచంగిపుట్టులో 13.3, జి.మాడుగులలో 13.6, పెదబయలులో 13.8, హుకుంపేటలో 14.1, చింతపల్లిలో 14.9, అనంతగిరిలో 15.8, కొయ్యూరులో 18.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 03 , 2026 | 12:34 AM