క్రీడలతో మెరుగైన సమాజం
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:24 AM
క్రీడలతో మెరుగైన సమాజం రూపుదిద్దవచ్చునని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి డా.మన్సుఖ్ మాండవీయపేర్కొన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ
బీచ్‌రోడ్డులో ఉత్సాహంగా బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ర్యాలీ
బీచ్ రోడ్డు ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
క్రీడలతో మెరుగైన సమాజం రూపుదిద్దవచ్చునని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి డా.మన్సుఖ్ మాండవీయపేర్కొన్నారు. ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలన్నారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి నిదర్శనమన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయన్నారు. ఫిట్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. సుమారు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 50 లక్షల మంది యువత భాగస్వాములయ్యారన్నారు. సైక్లింగ్ అద్భుత వ్యాయాయమమని, కాలుష్యానికి మంచి పరిష్కారమన్నారు. అనంతరం నవోటెల్ హోటల్ నుంచి వైఎంసీ జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్స్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, శాప్ ఎండీ భరణి, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవిఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, తదితరులు పాల్గొన్నారు.