టెన్త్ హిందీ పరీక్షకు 99.39 శాతం హాజరు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:39 AM
జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి వార్షిక హిందీ పరీక్షకు 99.39 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ తెలిపారు.
జిల్లాలో 44 పరీక్షాల కేంద్రాల్లో నిర్వహణ
పాడేరురూరల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి వార్షిక హిందీ పరీక్షకు 99.39 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ తెలిపారు. జిల్లాలోని 11 మండలాల్లో 44 పరీక్షా కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థినీ, విద్యార్థులు 7,229 మంది హాజరు కావాల్సి ఉండగా 7,185 మంది(99.39 శాతం) హాజరయ్యారన్నారు. అలాగే జిల్లాలో సార్వత్రిక పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంగ్లీషు పరీక్షకు 868 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 797 మంది హాజరయ్యారని తెలిపారు. 71 మంది గైర్హాజరు కావడంతో 91.87 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు.