టెన్త్ లెక్కల పరీక్షకు 98.84 శాతం హాజరు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:30 PM
జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి లెక్కల పరీక్షకు 98.84 శాతం మంది హాజరయ్యారని డీఈవో డాక్టర్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ తెలిపారు.
పాడేరురూరల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి లెక్కల పరీక్షకు 98.84 శాతం మంది హాజరయ్యారని డీఈవో డాక్టర్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ తెలిపారు. జిల్లాలోని 11 మండలాల్లో 44 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లెక్కల పరీక్షకు రెగ్యులర్ విద్యార్థినీ, విద్యార్థులు 7,622 మంది హాజరు కావాల్సి ఉండగా, 7,534 మంది(98.84 శాతం) హాజరయ్యారు. అలాగే జిల్లాలో సార్వత్రిక పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు 898 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 807 మంది(89.87 శాతం) హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సీఐ డి.దీనబందు పర్యవేక్షణలో ఎస్‌ఐ కె.పాపినాయుడు, పోలీసులు విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపించారు.