Share News

జిల్లాలో టెన్త్‌ అడ్వాన్డ్స్‌లో 92.61 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:44 PM

పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో అల్లూరి జిల్లా 92.61 శాతం ఉత్తీర్ణత సాధించింది. శుక్రవారం ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.

జిల్లాలో టెన్త్‌ అడ్వాన్డ్స్‌లో 92.61 శాతం ఉత్తీర్ణత

రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం

పాడేరురూరల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో అల్లూరి జిల్లా 92.61 శాతం ఉత్తీర్ణత సాధించింది. శుక్రవారం ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచిందని ప్రభుత్వ పరీక్షల విద్యాకమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ తెలిపారు. జిల్లా పరిధిలోని 11 మండలాలకు చెందిన బాలురు 2,526 మంది, బాలికలు 2,559 మంది మొత్తంగా 5,085 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,316 మంది, బాలికలు 2,393 మంది మొత్తంగా 4,709 ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాకు 92.61 శాతం ఉత్తీర్ణత లభించింది.

Updated Date - Jun 19 , 2026 | 10:44 PM