Share News

విశాఖపట్నంలో సామాజిక పింఛన్లు 91.39 శాతం పంపిణీ

ABN , Publish Date - May 02 , 2026 | 01:00 AM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ శుక్రవారం 91.39 శాతం పూర్తయ్యింది. సాయంత్రానికి జిల్లాలో 1,57,914 మందికిగాను 1,44,324 మందికి (91.39 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు.

విశాఖపట్నంలో  సామాజిక పింఛన్లు 91.39 శాతం పంపిణీ
Visakhapatnam Pension Distribution

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ శుక్రవారం 91.39 శాతం పూర్తయ్యింది. సాయంత్రానికి జిల్లాలో 1,57,914 మందికిగాను 1,44,324 మందికి (91.39 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తం రూ.69.46 కోట్లకుగాను రూ.63.21 కోట్లు పింఛన్‌దారులకు అందజేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,228 మందికి గాను 24,211 మందికి రూ.10.2 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,31,686 మందికి గాను 1,20,113 మందికి రూ.53 కోట్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పెదజాలారిపేటలో పింఛన్లు పంపిణీ చేశారు.

Updated Date - May 02 , 2026 | 07:09 AM