Share News

పాలిసెట్‌లో 90.64 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - May 06 , 2026 | 12:52 AM

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌-2026 పరీక్షలో జిల్లా నుంచి 8,141 మంది (90.64 శాతం) అర్హత సాధించారు. మొత్తం 8,982 మంది హాజరుకాగా వీరిలో బాలురు 5,050, బాలికలు 3,932 మంది వున్నారు. బాలురు 4,468 మంది (88.48 శాతం), బాలికలు 3,674 మంది (93.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

పాలిసెట్‌లో 90.64 శాతం ఉత్తీర్ణత
గాడి యశ్వంతి (117/120)

బాలికలదే పైచేయి

118 మార్కులతో హర్షవర్దన్‌ ఆదిత్య జిల్లా టాపర్‌

అనకాపల్లి రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌-2026 పరీక్షలో జిల్లా నుంచి 8,141 మంది (90.64 శాతం) అర్హత సాధించారు. మొత్తం 8,982 మంది హాజరుకాగా వీరిలో బాలురు 5,050, బాలికలు 3,932 మంది వున్నారు. బాలురు 4,468 మంది (88.48 శాతం), బాలికలు 3,674 మంది (93.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అనకాపల్లి జిల్లాలో పదో తరగతి చదివి, పాలిసెట్‌కు హాజరైన వారిలో జిల్లా టాపర్లుగా మోసూరి హర్షవర్దన్‌ ఆదిత్య 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 86వ ర్యాంకు, కాపుశెట్టి గుణదీపిక వెంకట సాయిశ్రీ 117 మార్కులతో 158వ ర్యాంకు, కె.కోటపాడు మండలం ఆర్లె పంచాయతీ ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన గాడి యశ్వంతి 117 మార్కులతో 163వ ర్యాంకు సాధించారు.

దేవరాపల్లి విద్యార్థినికి 119 మార్కులు

దేవరాపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌లో దేవరాపల్లికి చెందిన వెత్సా షణ్ముఖి 120 మార్కులకుగాను 119 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో 39వ ర్యాంకు సాధించింది. ఆమె పదో తరగతి విశాఖలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థలో చదివింది. తండ్రి జోగిరాజురేషన్‌ డీలర్‌కాగా, తల్లి పరమేశ్వరి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీలో చేరి, ఇంజనీరింగ్‌ చేసిన తరువాత సివిల్స్‌కు వెళతానని ఈ సందర్భంగా షణ్ముఖి చెప్పారు.

Updated Date - May 06 , 2026 | 12:52 AM