ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 90.03 శాతం పంపిణీ
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:29 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90.03 శాతం పూర్తయ్యిందని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే పింఛన్ డబ్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. జిల్లాలో 2,51,357 మంది పింఛన్‌దారులు వుండగా గురువారం సాయంత్రానికి 2,26,295 (90.03 శాతం) మందికి డబ్బులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
అనకాపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90.03 శాతం పూర్తయ్యిందని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే పింఛన్ డబ్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. జిల్లాలో 2,51,357 మంది పింఛన్‌దారులు వుండగా గురువారం సాయంత్రానికి 2,26,295 (90.03 శాతం) మందికి డబ్బులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
కాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం పంచాయతీ గండిపేటలో, కలెక్టర్ విజయకృష్ణన్ సబ్బవరం మండలం అసకపల్లిలో, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేటలో, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల మండలం కేజే పురంలో, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఎలమంచిలిలో పలువురికి పింఛన్ డబ్బులు అందజేశారు.