Share News

88.74 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 02 , 2026 | 11:16 PM

మండలంలోని బూదరాళ్ల సమీపంలో 88.74 కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.

88.74 కిలోల గంజాయి పట్టివేత
విలేకర్లతో మాట్లాడుతున్న సీఐ బి.శ్రీనివాసరావు, మంప ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావు. వెనుక గంజాయి నిందితులు

ఇద్దరు నిందితులు అరెస్టు.. కారు సీజ్‌

కొయ్యూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): మంప ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావుకు ముందస్తు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిపి బూదరాళ్ల సమీపంలో శనివారం వాహన తనిఖీలను చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి కారును వెనక్కి మళ్లించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా ఒడిశా నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తున్న 88.74 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ సందర్భంగా కారులో ఉన్న జి.మాడుగుల మండలం బీరం గ్రామానికి చెందిన సమరెడ్డి చందుబాబు, ఉత్తప్రదేశ్‌ రాష్ట్రం మొకంగంజ్‌ గ్రామానికి చెందిన శివాంగ్‌దీక్షిత్‌లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.44 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయిని ఎక్కడ కొనుగోలు చేశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 02 , 2026 | 11:16 PM