Share News

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 84.7 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:06 AM

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాలో 84.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 84.7 శాతం ఉత్తీర్ణత

ఆరిలోవ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాలో 84.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 3,360 మంది పరీక్షలకు హాజరవ్వగా, 2,846 మంది పాసయ్యారన్నారు. సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ టెన్త్‌)లో 617 మంది పరీక్షలు రాయగా, 353 మంది (57.21 శాతం), ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు 719 మంది హాజరవగా 415 మంది (57.72) శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు ఈనెల 26లోగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని డీఈవో తెలిపారు. ఒక్కో సబ్జెక్టు రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున చెల్లించాలన్నారు.


నేడు పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ డబ్బులు జమ

జిల్లాలో 18,573 మంది రైతులకు లబ్ధి

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2026-27 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకాల కింద తొలివిడత ఆర్థిక సాయాన్ని శనివారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. జిల్లాలో 18,573 మంది రైతులకు రూ.ఏడు వేలు (పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు) చొప్పున అందనున్నాయి. ఇందుకు సంబంధించి మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భీమిలి నియోజకవర్గ పరిధిలోని బోని, గాజువాక నియోజకవర్గ పరిధిలోని దువ్వాడ, పెందుర్తిలో సమావేశాలు నిర్వహించనున్నారు. రైతులంతా హాజరు కావాలని జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి కోరారు.

Updated Date - Jun 20 , 2026 | 01:06 AM