Share News

ఎంపీటీసీల్లో 80% కూటమికే

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:48 AM

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల్లో కూటమి సత్తాచాటింది. జిల్లా మొత్తం 427 స్థానాలకు వుండగా 342 స్థానాలకు కైవసం చేసుకుంది. వీటిలో తెలుగుదేశం 248, జనసేన 85, బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచాయి. మరో పది స్థానాల్లో కూటమికి చెందిన రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్ష వైసీపీ 74 స్థానాలతో మూడో స్థానానికి పరిమితమైంది. ఎలమంచిలి, మాడుగుల మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా దక్కలేదు. గరిష్ఠంగా మునగపాక, నక్కపల్లి మండలాల్లో ఎనిమిది చొప్పున, పాయకరావుపేటలో ఏడు గెలిచి ఉనికిని చాటుకుంది. ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో రెండంకెల సీట్లు పొందింది. అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత దారుణంగా నాలుగు మాత్రమే దక్కాయి.

ఎంపీటీసీల్లో 80% కూటమికే
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రావికమతం మండలఓట్లు లెక్కిస్తున్న దృశ్యం

వైసీపీకి 17.33 శాతం

ఎలమంచిలి, మాడుగుల మండలాల్లో ఖాతా తెరవని ప్రతిపక్షం

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల్లో కూటమి సత్తాచాటింది. జిల్లా మొత్తం 427 స్థానాలకు వుండగా 342 స్థానాలకు కైవసం చేసుకుంది. వీటిలో తెలుగుదేశం 248, జనసేన 85, బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచాయి. మరో పది స్థానాల్లో కూటమికి చెందిన రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్ష వైసీపీ 74 స్థానాలతో మూడో స్థానానికి పరిమితమైంది. ఎలమంచిలి, మాడుగుల మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా దక్కలేదు. గరిష్ఠంగా మునగపాక, నక్కపల్లి మండలాల్లో ఎనిమిది చొప్పున, పాయకరావుపేటలో ఏడు గెలిచి ఉనికిని చాటుకుంది. ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో రెండంకెల సీట్లు పొందింది. అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత దారుణంగా నాలుగు మాత్రమే దక్కాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. అనకాపల్లి నియోజకవర్గంలో మొత్తం 45 ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. వీటిలో కూటమి 41 (టీడీపీ 18, జనసేన 23) స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. ఎలమంచిలి నియోజకవర్గంలో 58 ఎంపీటీసీలకుగాను కూటమి 37 స్థానాలు (టీడీపీ 19, జనసేన 17, బీజేపీ 1) గెలిచింది. వైసీపీకి 14 దక్కగా, మరో ఏడు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 87 స్థానాలకుగాను కూటమి 67చోట్ల (టీడీపీ 51, జనసేన 15, బీజేపీ 1) గెలవగా, వైసీపీ 17చోట్ల, స్వతంత్రులు మూడుచోట్ల గెలిచారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 58 ఎంపీటీసీలకుగాను కూటమి 48 (టీడీపీ 44, జనసేన 3, బీజేపీ 1), వైసీపీ పదిచోట్ల గెలుపొందాయి. చోడవరం నియోజకవర్గంలో 78 స్థానాలకుగాను కూటమి 63 (టీడీపీ 51, జనసేన 11, బీజేపీ 1) స్థానాలు, వైసీపీ 15 స్థానాల్లో గెలిచాయి. మాడుగుల నియోజకవర్గంలో 68 స్థానాలకుగాను కూటమి 60 స్థానాల్లో (టీడీపీ 51, జనసేన 7, బీజేపీ 2), వైసీపీ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడ, సబ్బవరం మండలాల్లో 33 స్థానాలకుగాను కూటమి 26 స్థానాల్లో గెలిచింది. వైసీపీకి ఏడు స్థానాలు దక్కాయి.

మండలం ఎంపీటీసీ టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇతరులు

స్థానాలు

01. అనకాపల్లి 26 10 14 - 2 -

02. కశింకోట 19 8 9 - 2 -

03. మునపాక 16 3 5 8

04. అచ్యుతాపురం 21 5 7 1 3 5

05. రాంబిల్లి 14 6 3 - 3 2

06. ఎలమంచిలి 7 5 2 - - -

07. ఎస్‌.రాయవరం 21 16 4 - 1 -

08. నక్కపల్లి 23 10 4 - 8 1

09. పాయకరావుపేట 27 11 6 1 7 2

10. కోటవురట్ల 16 14 1 - 1 -

11. నర్సీపట్నం 9 7 - - 2 -

12. నాతవరం 18 13 - - 5 -

13. గొలుగొండ 15 10 2 1 2 -

14. మాకవరపాలెం 16 14 1 - 1 -

15. రోలుగుంట 14 11 2 - 1 -

16. రావికమతం 20 12 3 - 5 -

17. బుచ్చెయ్యపేట 19 12 1 - 6 -

18. చోడవరం 25 16 5 1 3

19. మాడుగుల 21 17 4 - - -

20. చీడికాడ 13 10 1 - 2 -

21. దేవరాపల్లి 17 13 1 - 3 -

22. కె.కోటపాడు 17 11 1 2 2 1

23. సబ్బవరం 19 11 6 1 1 -

24. పరవాడ 14 3 4 1 6 -

మొత్తం 427 248 86 8 74 11

Updated Date - Nov 08 , 2026 | 01:48 AM