Share News

80 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:11 AM

80 కిలోల గంజాయి స్వాధీనం

80 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

- ఇద్దరి అరెస్టు

అరకులోయ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీఐ కళాశాల సమీపంలో 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఐటీఐ కళాశాల సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా, అరకు నుంచి విశాఖపట్నం వైపు కారు రావడాన్ని గమనించి ఆపారు. కారులో ఉన్న నలుగురు దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. కారును తనిఖీ చేయగా 80 కిలోల గంజాయి బయటపడింది. పట్టుబడిన కర్ణాటక మైసూరుకు చెందిన కాశీం షరీఫ్‌, సాయిబ్‌ అలీని ఆరెస్టు చేసి, కారుతో పాటుగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 12:16 AM