జిల్లాలో 77,552 మందికి తల్లికి వందనం
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:55 AM
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నగదు బుధవారం నుంచి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ కానుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 77 వేల 552 మంది తల్లులు ఈ పథకానికి అర్హులని అధికారులు గుర్తించారు.
- నేటి నుంచి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున నగదు జమ
- ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఆగస్టు 30న
పాడేరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నగదు బుధవారం నుంచి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ కానుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 77 వేల 552 మంది తల్లులు ఈ పథకానికి అర్హులని అధికారులు గుర్తించారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న వారితో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లులకు తల్లికి వందనం పథకంలో రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది. జిల్లాలో 1 లక్షా 33 వేల 984 మంది విద్యార్థులున్నారని, వారిలో తొలి విడతగా 77 వేల 552 మందిని తల్లికి వందనం పథఽకంలో అర్హులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేలులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి కేటాయించగా, తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ కానున్నాయి. ఈ నగదు జమ ప్రక్రియను బుధవారం ప్రారంభించి, మెగా పీటీఎం నిర్వహించే శుక్రవారం వరకు కొనసాగిస్తారు. అలాగే ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఆగస్టు 30న ఈ పథకం నగదును జమ చేస్తారు.