76.69 లక్షలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:45 AM
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కోసం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించి మరో వారం రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. ఆరంభం నుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓఆర్ వంద శాతం దాటింది. ఈ పథకం అమల్లోకి రాక ముందు 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు నర్సీపట్నం డిపో నుంచి నడిచే బస్సుల్లో మొత్తం (మహిళలు, పురుషులు కలిపి) 74.83 లక్షలు మంది ప్రయాణించగా, స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జూలై చివరినాటికి 76.69 లక్షలు మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.
స్ర్తీ శక్తి పథకం ద్వారా ‘నర్సీపట్నం’ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య ఇది
జూలై చివరినాటికి టికెట్ల రూపంలో రూ.45.71 కోట్లు ఆదా
బస్సుల్లో గణనీయంగా పెరిగిన ఓఆర్
నర్సీపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కోసం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించి మరో వారం రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. ఆరంభం నుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓఆర్ వంద శాతం దాటింది. ఈ పథకం అమల్లోకి రాక ముందు 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు నర్సీపట్నం డిపో నుంచి నడిచే బస్సుల్లో మొత్తం (మహిళలు, పురుషులు కలిపి) 74.83 లక్షలు మంది ప్రయాణించగా, స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జూలై చివరినాటికి 76.69 లక్షలు మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నారు. నర్సీపట్నం డిపోలో 92 బస్సులు వుండగా వీటిలో 71 బస్సుల్లో (పల్లె వెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్) మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు వుంది. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 74.83 లక్షల మంది (పురుషులు, మహిళలు కలిపి) ప్రయాణించడం ద్వారా ఆర్టీసీకి రూ.47.73 కోట్ల ఆదాయం వచ్చింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జూలై 31వ తేద వరకు స్త్రీశక్తి పథకం కింద 76.69 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తద్వారా ఆర్టీసీకి రూ.45.71 కోట్లు ఆదాయం వచ్చింది. టికెట్ తీసుకొని ప్రయాణం చేసిన వారు 52.45 మంది (పురుషులు, మహిళలు) ఉన్నారు. తద్వారా ఆదాయం రూ.15.4 కోట్ల ఆదాయం సమకూరింది. స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత నర్సీపట్నం డిపోనకు రూ.61.11 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ.13.38 కోట్ల ఆదాయం పెరిగింది. స్త్రీశక్తి ద్వారా మహిళలకు రూ.45.71 కోట్లు ఆదా అయ్యాయి.