గ్రామ పంచాయతీల్లో 6,344 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:44 AM
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 24 మండలాల్లో 646 గ్రామ పంచాయతీల పరిధిలో 6,276 వార్డులకు మొత్తం 6,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,28,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,98,955 మంది పురుషులు, 6,29,274 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఉన్నారు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అందుబాటులో వుంచారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలని, వీటిని పరిశీలించిన అనంతరం 31వ తేదీన తుది జాబితాలను వెల్లడిస్తామని డీపీఓ సందీప్ తెలిపారు.
ముసాయిదా జాబితా విడుదల
మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శన
646 గ్రామ పంచాయతీలు, 6,276 వార్డులు
12.28 లక్షల మంది ఓటర్లు
26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
31న తుది జాబితా విడుదల
అనకాపల్లి, ఆగస్టు23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 24 మండలాల్లో 646 గ్రామ పంచాయతీల పరిధిలో 6,276 వార్డులకు మొత్తం 6,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,28,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,98,955 మంది పురుషులు, 6,29,274 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఉన్నారు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అందుబాటులో వుంచారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలని, వీటిని పరిశీలించిన అనంతరం 31వ తేదీన తుది జాబితాలను వెల్లడిస్తామని డీపీఓ సందీప్ తెలిపారు.
మండలాల వారీగా..
అనకాపల్లి మండలంలో 32 గ్రామ పంచాయతీల్లో 332 వార్డులకు 350 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 81,568 మంది ఓటర్లు ఉన్నారు. అచ్యుతాపురంలో 34 పంచాయతీలు ఉండగా 320 వార్డులకు 320 పోలింగ్ కేంద్రాలు వుంటాయి. 63,003 మంది ఓటర్లు ఉన్నారు. బుచ్చెయ్యపేటలో 35 పంచాయతీల్లో 320 వార్డులకు 320 పోలింగ్ కేంద్రాలు, 52,238 మంది ఓటర్లు ఉన్నారు. చీడికాడలో 23 పంచాయతీలకు 222 వార్డులు, 222 పోలింగ్ కేంద్రాలు, 36,784 మంది ఓటర్లు వున్నారు. చోడవరంలో 32 పంచాయతీల్లో 340 వార్డులకు 340 పోలింగ్ కేంద్రాలు, 72,986 మంది ఓటర్లు ఉన్నారు. దేవరాపల్లిలో 27 పంచాయతీల్లో 258 వార్డులకు 258 పోలింగ్ కేంద్రాలు, 47,250 మంది ఓటర్లు ఉన్నారు. కశింకోట మండలంలో 27 పంచాయతీల పరిధిలో 272 వార్డులకు 290 పోలింగ్ కేంద్రాలు వుంటాయి. ఇక్కడ 56,589 మంది ఓటర్లు ఉన్నారు. కె.కోటపాడులో 32 పంచాయతీల్లో 292 వార్డుల కోసం 292 పోలింగ్ కేంద్రాలు వుంటాయి. మొత్తంం 49,338 మంది ఓటర్లు ఉన్నారు. మునగపాకలో 26 పంచాయతీలు ఉండగా 250 వార్డులకు 250 పోలింగ్ కేంద్రాలు, 45,716 ఓటర్లు ఉన్నారు.
పాయకరావుపేట మండలంలో 24 పంచాయతీల పరిధిలో 264 వార్డులకు 284 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. ఈ మండలంలో 79,850 మంది ఓటర్లు ఉన్నారు. నక్కపల్లిలో 33 పంచాయతీల్లో 326 వార్డులకు 326 పోలింగ్ కేంద్రాలు, 66,206 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్.రాయవరం మండలంలో 28 పంచాయతీల్లో 290 వార్డులకు 290 పోలింగ్ కేంద్రాలు, 62,032 మంది ఓటర్లు ఉన్నారు. గొలుగొండలో 27 పంచాయతీల్లో 260 వార్డులకు 260 పోలింగ్ కేంద్రాలు, 41,612 మంది ఓటర్లు వున్నారు. మాకవరపాలెంలో 31 పంచాయతీల్లో 288 వార్డులకు 288 పోలింగ్ కేంద్రాలు, 46,985 మంది ఓటర్లు ఉన్నారు. నాతవరంలో 31 పంచాయతీల్లో 304 వార్డులకు 304 పోలింగ్ కేంద్రాలు, 51,781 మంది ఓటర్లు ఉన్నారు. నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీల్లో 124 వార్డులకు 124 పోలింగ్ కేంద్రాలు, 23,962 మంది ఓటర్లు ఉన్నారు. రావికమతంలో 28 పంచాయతీల్లో 276 వార్డులకు 276 పోలింగ్ కేంద్రాలు, 56,004 మంది ఓటర్లు. రోలుగుంటలో 24 పంచాయతీల్లో 228 వార్డులకు 228 పోలింగ్ కేంద్రాలు, 37,950 మంది ఓటర్లు ఉన్నారు. వి.మాడుగులలో 29 పంచాయతీల్లో 282 వార్డులకు 282 పోలింగ్ కేంద్రాలు, 56,538 మంది ఓటర్లు ఉన్నారు. రాంబిల్లి మండలంలో 30 పంచాయతీలు, 234 వార్డులకు 246 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించారు. అయితే పంచాయతీల విభజనకు సంబంధించిన కోర్టు కేసుల కారణంగా నాలుగు పంచాయతీలను ముసాయిదా ప్రచురణ నుంచి మినహాయించినట్టు అధికారులు పేర్కొన్నారు.