Share News

60 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:09 PM

ఒడిశా నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురి అరెస్టు చేశారు.

60 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ వెంకటేశ్‌, సిబ్బంది

ముగ్గురి అరెస్టు

పెదబయలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ రోగులపేట కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అటువైపు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, అందులో రెండు బస్తాల్లో 60 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్‌కు చెందిన అర్ణబర్త గ్రామ నివాసి సురేశ్‌ ఖారా, కోరాపుట్‌ జిల్లా నందపూర్‌ బ్లాక్‌ దోకన్‌పుట్‌ గ్రామానికి చెందిన రఘురామ్‌ ఖేముడు, అదే గ్రామానికి చెందిన జునిష్‌ ఖేముడు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ గంజాయిని చిత్రకొండ బ్లాక్‌లోని మారుమూల కొండ ప్రాంతం నుంచి ఆంధ్రకు తరలిస్తూ వీరు పట్టుబడ్డారన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ వెంకటేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:09 PM