Share News

51.47% పోలింగ్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:36 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో 51.47 శాతం పోలింగ్‌ నమోదైంది.

51.47% పోలింగ్‌

జీవీఎంసీలో మొత్తం ఓటర్లు 18,37,901

ఓటు హక్కు వినియోగించుకున్నవారు 9,45,915 మంది

పురుషులు 4,55,395 మంది, మహిళలు 4,90,519 మంది, ఇతరులు ఒకరు...

పురుషుల కంటే మహిళలు 35,124 మంది ఎక్కువ

భీమిలి జోన్‌లో అత్యధికంగా 65.9 శాతం పోలింగ్‌

అత్యల్పంగా ‘నార్త్‌’ జోన్‌లో 44.24 శాతం

2021 ఎన్నికలతో పోల్చితే దాదాపు తొమ్మిది శాతం తక్కువ

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో 51.47 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 18,37,901 మందికిగాను 9,45,915 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 4,55,395 మంది కాగా మహిళలు 4,90,519 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా (35,124 మంది) ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా నివసించే కోర్‌ సిటీతో పోల్చితే నగర శివారు ప్రాంతాల్లోనే అత్యధిక ఓటింగ్‌ నమోదైంది. 2021లో జరిగిన ఎన్నికల కంటే దాదాపు తొమ్మిది శాతం ఓటింగ్‌ తగ్గింది.

జీవీఎంసీ పరిధిలో గల 120 వార్డుల్లో 18,37,901 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా 1,990 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కానీ ఆదివారం సగం మంది మాత్రమే ఓటేసేందుకు వచ్చారు. అత్యధికంగా భీమిలి జోన్‌లో 65.9 శాతం పోలింగ్‌ నమోదవ్వగా, అత్యల్పంగా నార్త్‌ జోన్‌ పరిధిలో 44.24 శాతం నమోదైంది. భీమిలి జోన్‌లో ఐదు వార్డులు, 78 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 66,446 మంది ఓటర్లు ఉండగా, 43,791 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి జోన్‌లో 65.54 శాతం పోలింగ్‌ జరిగింది. అక్కడ ఆరు వార్డుల్లోని 89 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 76,950 మంది ఉండగా 50,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాజువాక జోన్‌లో 19 వార్డులు ఉండగా 329 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అక్కడ మొత్తం ఓటర్లు 2,98,220 కాగా వారిలో 1,61,339 మంది (54.1) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అగనంపూడి జోన్‌లో 53.46 శాతం పోలింగ్‌ జరిగింది. ఆ జోన్‌లో ఐదు వార్డులు, 76 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 69,796 మంది ఓటర్లు ఉండగా, 37,314 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సౌత్‌ జోన్‌లో 16 వార్డులు ఉండగా, వాటి పరిధిలో 249 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,17,817 మంది ఉండగా, వారిలో 1,11,606 మంది (51.24 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వెస్ట్‌ జోన్‌లోని 17 వార్డులు, 245 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,22,029 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,13,690 మంది (51.21 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురవాడ జోన్‌లో ఏడు వార్డులు, 162 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,49,452 మంది ఓటర్లు ఉండగా 75,932 మంది (50.81 శాతం), ఈస్ట్‌ జోన్‌లో 18 వార్డులు, 309 పోలింగ్‌ కేంద్రాల పరిఽధిలో 2,96,124 మంది ఓటర్లు ఉండగా 1,49,687 మంది (50.55 శాతం), పెందుర్తి జోన్‌లో ఏడు వార్డులు, 152 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,49,367 మంది ఉండగా 73,080 మంది (48.93 శాతం), నార్త్‌ జోన్‌లో 20 వార్డులు, 302 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,91,691 మంది ఉండగా కేవలం 1,29,049 మంది (44.24 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలతో పోల్చితే శివారు ప్రాంతాలైన అనకాపల్లి, భీమిలి, అనకాపల్లి, పెందుర్తి వంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఓటింగ్‌ నమోదుకావడంతో సంపన్నులు, విద్యావంతులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జోన్‌ వార్డులు పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు పోల్‌అయిన ఓట్లు శాతం

భీమిలి 5 78 66,446 43,791 65.90

మధురవాడ 7 162 1,49,452 75,932 50.81

ఈస్ట్‌ 18 309 2,96,124 1,49,687 50.55

సౌత్‌ 16 249 2,17,817 1,11,606 51.24

నార్త్‌ 20 302 2,91,691 1,29,049 44.24

వెస్ట్‌ 17 245 2,22,029 1,13,690 51.21

గాజువాక 19 329 2,98,220 1,61,339 54.10

అగనంపూడి 5 76 69,796 37,314 53.46

అనకాపల్లి 6 89 76,950 50,430 65.54

పెందుర్తి 7 152 1,49,367 73,080 48.93

-------------

Updated Date - Nov 02 , 2026 | 01:36 AM