నర్సీపట్నంలో 49,099 ఓటర్లు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:41 AM
మునిసిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వార్డుల పునర్విభజన జాబితాను ఇటీవల ప్రదర్శించిన అధికారులు... మంగళవారం ఫొటో ఓటరు జాబితాలను విడుదల చేశారు. వీటిని అన్ని స్వర్ణ వార్డులు, సబ్ కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో వుంచారు.
పురుషులు 23,317, మహిళలు 25,778, ఇతరులు నలుగురు
ముసాయిదా జాబితాలు విడుదల
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు నేటి నుంచి సర్వే
నర్సీపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వార్డుల పునర్విభజన జాబితాను ఇటీవల ప్రదర్శించిన అధికారులు... మంగళవారం ఫొటో ఓటరు జాబితాలను విడుదల చేశారు. వీటిని అన్ని స్వర్ణ వార్డులు, సబ్ కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో వుంచారు. మునిసిపాలిటీలో 49,099 మంతి ఓటర్లు వుండగా వీరిలో పురుషులు 23,317 మంది, మహిళలు 25,778, ఇతరులు నలుగురు ఉన్నారు. బుధవారం నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేస్తారు. 26వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాలను మునిసిపల్, సబ్ కలెక్టర్, తహశీల్దార్, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 27, 28 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 29, 30 తేదీల్లో అభ్యంతరాలపై విచారణ చేపట్టి, అవసరమైతే సవరణలు చేస్తారు. అక్టోబరు ఒకటో తేదీన తుది ఓటరు జాబితాలను ప్రకటిస్తారు.