Share News

జిల్లాలో 44 మంది షైనింగ్‌ స్టార్స్‌

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:11 PM

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన 44 మంది విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌ అవార్టులకు ఎంపికయ్యారని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారిణి పీబీకే.పరిమళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 44 మంది షైనింగ్‌ స్టార్స్‌
ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారిణి పరిమళ (ఫైల్‌ ఫొటో)

టెన్త్‌లో 27 మంది, ఇంటర్‌లో 17 మంది విద్యార్థుల ఎంపిక

20వ తేదీన అవార్డుల ప్రదానం

పాడేరురూరల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన 44 మంది విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌ అవార్టులకు ఎంపికయ్యారని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారిణి పీబీకే.పరిమళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హత, ప్రమాణాల ప్రకారం జిల్లాకు సంబంధించి ఎస్‌ఎస్‌సీలో 27 మంది, ఇంటర్మీడియట్‌లో 17 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి పతకం, ప్రశంసాపత్రంతోపాటు రూ.20 వేలు నగదు బహుమతిని అందజేసి సత్కరిస్తారన్నారు. ఎస్‌ఎస్‌సీలో షైనింగ్‌ అవార్డులకు అనంతగిరి మండలానికి చెందిన వారు ఇద్దరు, అరకులోయ నుంచి ఇద్దరు, డుంబ్రిగుడ నుంచి ఒకరు, పెదబయలు నుంచి ముగ్గురు, ముంచంగిపుట్టు నుంచి ఒకరు, పాడేరు నుంచి ఐదుగురు, జి.మాడుగుల నుంచి ఒకరు, చింతపల్లి నుంచి ఆరుగురు, జీకేవీధి నుంచి ఐదుగురు, కొయ్యూరు మండలం నుంచి ఒకరు ఎంపికయ్యారన్నారు. ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు పాడేరు ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి బహూకరిస్తారని ఇన్‌చార్జి డీఈవో పరిమళ తెలిపారు.

Updated Date - Jul 18 , 2026 | 11:11 PM