4 జోన్లు...13 హాళ్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:08 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సుకు ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చురుగ్గా సాగుతున్న పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లు
ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్ సిద్ధం
నేడు ప్రధాన వేదిక అప్పగింత
ఏపీ థీమ్ పేరుతో పెవిలియన్
ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల ప్రదర్శన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సుకు ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి మంగళవారం సాయంత్రానికే వేదికను సిద్ధం చేసి, పోలీసులకు అప్పగించాల్సి ఉంది. అయితే పనులు కొనసాగుతుండడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడింది.
ఏయూ మైదానంలో మొత్తం 13 సమావేశపు మందిరాలు ఏర్పాటుచేస్తున్నారు. అందులో ప్రధాన వేదికతో పాటు బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, గ్రూప్ టు గ్రూప్ సమావేశాలు, గ్రూప్ టు బిజినెస్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లకు ప్రత్యేక ఛాంబర్లు సిద్ధం చేశారు. పారిశ్రామికవేత్తలతో భేటీ కావడానికి ఏర్పాట్లు చేశారు. ఏపీ థీమ్ పేరుతో పెవిలియన్ పెట్టారు. ఉత్పత్తుల ప్రదర్శనకు ఎంఎస్‌ఎంఈల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రాంగణాన్ని నాలుగు జోన్లుగా విభజించారు.
- జోన్ 1లోకి ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఐటీ మంత్రి, సీఎంఓ అధికారులు, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లా అధికారులు, కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.
- జోన్ 2,4లోకి ప్రభుత్వ అధికారులు, ఈడీబీ అధికారులను అనుమతిస్తారు.
- జోన్ 2, 4లోకి భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులను అనుమతిస్తారు.
- జోన్-2,4లోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రత్యేక ఆహ్వానితులు, హై కమిషనర్లు, రాయబారులకు ప్రవేశం కల్పిస్తారు.
- వక్తలకు జోన్ 2, 3, 4,లకు అనుమతి ఇచ్చారు.
- ప్రదర్శకులు, లైజన్ అధికారులు, విద్యార్థులు, సర్వీస్ ప్రొవైడర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌ను జోన్-4కు మాత్రమే పరిమితం చేశారు.
- పోలీసులకు ఒకటో జోన్ మినహా మిగిలిన మూడు జోన్లకు అనుమతి ఇచ్చారు.
- హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, వ్యక్తిగత సహాయకులకు నాలుగు జోన్లకు అనుమతి ఇచ్చారు.
నగరం సర్వాంగ సుందరం
రహదారుల నిర్మాణం/మరమ్మతులు
డివైడర్లపై పూల కుండీల ఏర్పాట్లు
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పెట్టుబడిదారుల సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో అధికారులు, సిబ్బంది తలమునకలై ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, అందులో అధికారులు అంతా మొన్నటి వరకు కీలక భూమిక పోషించడంతో సదస్సు పనులు ముందుగా చేపట్టే అవకాశం లేకుండా పోయింది. అటు ఎన్నికల ఫలితాలు వెల్లడించి, ఇటు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి రేయింబవళ్లు పనులు పురమాయిస్తూ, పర్యవేక్షిస్తూ, సమీక్షించుకుంటూ వెళుతున్నారు.
ఈసారి అతిథులు భోగాపురం విమానాశ్రయం నుంచి నగరానికి రానున్నందున ఆనందపురం నుంచి రహదారులకు మరమ్మతులు, డివైడర్లకు రంగులు, వాటి మధ్యలో పూలకుండీల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు నగరంలో సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ మైదానం వరకు, అటు బీచ్ రోడ్డు, హోటళ్లకు వెళ్లే మార్గాలను బాగు చేస్తున్నారు. రంగులు వేస్తున్నారు. వేదిక వద్ద ఏర్పాట్లను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు మంగళవారం దగ్గరుండి పరిశీలించారు. అతిథులకు ప్రొటోకాల్, వాహనాల పార్కింగ్, సెక్యూరిటీ, శానిటేషన్ వంటివి మరోసారి చూసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ ఆదేశించారు. అక్కడి నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. సదస్సుకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా వేదిక పనులు పూర్తిచేసి పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో పాటు నోవాటెల్, రాడీసన్, పార్కు హోటళ్లలోను పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నగరానికి ప్రముఖులు...
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాక
13న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ...
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర హోం మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. బుధవారం సాయంత్రం సీఎం, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నగరానికి చేరుకుంటారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ శుక్రవారం మధ్యాహ్నం 12.55 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 3.15 గంటలకు విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగాలో దిగుతారు. అక్కడ స్వాగత, పరిచయ కార్యక్రమాలు పూర్తయిన తరువాత నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోని పెట్టుబడిదారుల సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ముగింపు వేడుకలో పాల్గొని తిరిగి 5.45 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి