Share News

అరకులోయలో 39.1 డిగ్రీలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:33 AM

మన్యంలో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో బుధవారం 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అరకులోయలో 39.1 డిగ్రీలు
బుధవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న అరకులోయ నాలుగు రోడ్ల జంక్షన్‌

మన్యంలో మండుతున్న ఎండలు

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో బుధవారం 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తర్వాత తీవ్రత అధికమవుతున్నది. మధ్యాహ్నం వేళలో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. అరకులోయలో 39.1, జి.మాడుగులలో 37.8, కొయ్యూరులో 37.5, చింతపల్లిలో 36.2, హుకుంపేటలో 35.7, పెదబయలులో 34.2, ముంచంగిపుట్టులో 33.7, అనంతగిరిలో 33.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో..

అరకులోయ: పట్టణంలో బుధవారం ఎండలు ఠారెత్తించాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇటీవల కాలంలో ఇంత ఎండ తీవ్రత ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 01:33 AM