Share News

38 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:17 PM

ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 38 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు అరకు సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

38 కిలోల గంజాయి పట్టివేత
పట్టుకున్న గంజాయి నిందితులతో పోలీసులు

ముగ్గురి అరెస్టు.. మరొకరి పరారీ

ఒడిశా నుంచి ఆటోలో రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

డుంబ్రిగుడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 38 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు అరకు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముందస్తు అందిన సమాచారంతో స్థానిక ఎస్‌ఐ సురేశ్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గుంటసీమ కేజీబీవీ పాఠశాల సమీపంలో వాహనాలు తనిఖీలను చేపట్టారన్నారు. ఒడిశా నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. ఈ సందర్భంగా ఆరు ప్యాకెట్లలో 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ఒకరు పరారీ అయ్యారని, మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న పాడేరు మండలం కించూరు పంచాయతీ ఒంటివీధుల గ్రామానికి చెందిన కిల్లో ద్రోహరావు, కిల్లో రాంబాబు, కిల్లో శ్రీనులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌ఐ సురేశ్‌, సిబ్బందిని సీఐ కోటేశ్వరరావు అభినందించారు.

Updated Date - Oct 09 , 2026 | 11:17 PM