Share News

310 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:11 AM

మండలంలోని ఆనందపురం జంక్షన్‌ వద్ద 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ పీవీవీ నరసింహారావు తెలిపారు.

310 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయితో పట్టుబడిన కార్లు

ముగ్గురి అరెస్టు

కె.కోటపాడు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆనందపురం జంక్షన్‌ వద్ద 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ పీవీవీ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు కె.కోటపాడు సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఎ.కోడూరు పోలీసుస్టేషన్‌ పరిధి ఆనందపురం జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా 310 కిలోల గంజాయి పట్టుబడింది. దీనిని రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన సద్దాం హుస్సేన్‌, అజీజ్‌ కార్తీక్‌, ప్రసాద్‌లను అరెస్టు చేశారు. సుందర్‌ అనే వ్యక్తి పరారయ్యాడు. నిందితుల నుంచి ఒక సెల్‌ఫోన్‌, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.

Updated Date - Nov 25 , 2026 | 01:11 AM