Share News

23న సీఎం రాక

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:01 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన విశాఖపట్నం రానున్నారు.

23న సీఎం రాక

విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ వెళతారు. అక్కడ ఆర్సెల్లార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు.


పెదగంట్యాడ యువకుడికి గేట్‌-26లో పదో ర్యాంకు

పెదగంట్యాడ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

స్థానిక అయ్యన్నపాలేనికి చెందిన గొందేశి ఆదిత్య యశ్వంత్‌ గేట్‌-26లో పదో ర్యాంకు (జనరల్‌ కేటగిరీ) సాధించాడు. ఆదిత్య చెన్నై ఐఐటీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేశాడు. ప్రస్తుతం కాన్పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఉద్యోగ అర్హత కోసం ‘గేట్‌’ రాసి ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పదో ర్యాండు సాధించాడు. ఎంటెక్‌ పూర్తయిన తరువాత పబ్లిక్‌ సెక్టార్‌కంపెనీలో ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీ చేయాలన్నది తన లక్ష్యమని ఆదిత్య తెలిపాడు. ఆదిత్య యశ్వంత్‌ తండ్రి పైడిరెడ్డి ప్రైవేటు ఉద్యోగి, తల్లి గృహిణి.

Updated Date - Mar 20 , 2026 | 01:01 AM