Share News

కూటమికి 22

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:08 AM

జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీపీ పదవులకు గురువారం పరోక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో కూటమి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 24 మండలాలకుగాను ఏకంగా 22 మండలాల్లో ఎంపీపీ పదవులను కూటమి కైవసం చేసుకుంది. వీటిలో 20 మండలాల్లో టీడీపీ, రెండు మండలాల్లో జనసేన అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. రాంబిల్లి మండలంలో టీడీపీ బీ ఫారం ఇచ్చిన అభ్యర్థిపై అదే పార్టీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యురాలు ఇండి.పెండెంట్‌గా పోటీ చేసి ఎంపీపీగా గెలుపొందారు.

కూటమికి 22
అనకాపల్లి ఎంపీపీ ఎన్నికల్లో బొడ్డపాటి నారాయణమ్మ (జనసేన)కు చేతులెత్తి మద్దతు తెలుపుతున్న కూటమి ఎంపీటీసీ సభ్యులు

ఎంపీపీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన

తెలుగుదేశం పార్టీకి 20 మండలాలు, జనసేనకు రెండు మండలాలు ఏకగ్రీవం

రాంబిల్లిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు

మునగపాక ఎన్నికల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులకు చెరో ఎనిమిది ఓట్లు

లాటరీలో వైసీపీని వరించిన ఎంపీపీ పదవి

వైస్‌ ఎంపీపీగా జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక

మండల ఉపాధ్యక్ష పదవుల్లో టీడీపీకి 9, జనసేనకు 7, బీజేపీకి 3

చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంటల్లో వాయిదా

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీపీ పదవులకు గురువారం పరోక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో కూటమి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 24 మండలాలకుగాను ఏకంగా 22 మండలాల్లో ఎంపీపీ పదవులను కూటమి కైవసం చేసుకుంది. వీటిలో 20 మండలాల్లో టీడీపీ, రెండు మండలాల్లో జనసేన అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. రాంబిల్లి మండలంలో టీడీపీ బీ ఫారం ఇచ్చిన అభ్యర్థిపై అదే పార్టీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యురాలు ఇండి.పెండెంట్‌గా పోటీ చేసి ఎంపీపీగా గెలుపొందారు. ఇక ప్రతిపక్ష వైసీపీకి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఒకే ఒక్క మునగపాక ఎంపీపీ పదవి... అది కూడా లాటరీ ద్వారా దక్కింది. ఎన్నికలు నిర్వహించిన మండల ఉపాధ్యక్ష పదవులన్నింటినీ కూటమి కైవసం చేసుకుంది. వీటిలో టీడీపీ 9, జనసేన 8, బీజేపీ మూడుచోట్ల గెలిచాయి. చోడవరం నియోజకవర్గంలోని అన్ని (నాలుగు) మండలాల్లో వైస్‌ ఎంపీపీ ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు.

మండలాల వారీగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, బ్రాకెట్లలో పార్టీలు..

నర్సీపట్నం- బోళెం అరుణశ్రీ (టీడీపీ), ముమ్మిన శ్రీదేవి (టీడీపీ), కోటవురట్ల- శెట్టి గీత (టీడీపీ), మడుగల కృష్ణ (టీడీపీ), సబ్బవరం- గండి వంశీదీప్‌ (టీడీపీ), దాసరి సత్యవతి (టీడీపీ), కె.కోటపాడు- పూడి వనజ (డీడీపీ), పైలా అమ్మాజీ (బీజేపీ), మాకవరపాలెం- సబ్బవరపు సత్యవరలక్ష్మి, (టీడీపీ), పాశపు చిట్టినాయుడు (టీడీపీ), నాతవరం- కొండ్రు మౌనిక (టీడీపీ), నందిపల్లి వెంకటరామణ (టీడీపీ), చీడికాడ- పోతల రమణమ్మ (టీడీపీ), పెంటకోట నాగమణి (జనసేన) ఎన్నికయ్యారు.

కశింకోట ఎంపీపీగా సిదిరెడ్డి శ్రీనివాసరావు (టీడీపీ), కరణం నూకరత్నం (జనసేన), నక్కపల్లి- కొప్పిశెట్టి హేమలత (టీడీపీ), కోన హారిక (టీడీపీ), మాడుగుల- వంతల రాము (టీడీపీ), ఉండూరు కాసులమ్మ (టీడీపీ), దేవరాపల్లి- వేచలపు నాగసత్యవేణి (టీడీపీ), సోమిరెడ్డి గోవింద (టీడీపీ), పరవాడ- కన్నూరు వెంకటరమణ (టీడీపీ), బుగిడి రామగోవిందరావు (జనసేన). గొలుగొండ- చిటికెల తారక వేణుగోపాల్‌ (టీడీపీ), గాదె వెంకటనాగలక్ష్మి (బీజేపీ), పాయకరావుపేట- కూండ్రపు రాజా (టీటీడీ), నేమాల స్వాతి (జనసేన), ఎలమంచిలి- ఇత్తంశెట్టి నాగవెంకటశ్రీలక్ష్మి (టీడీపీ), అన్నం స్వరాజ్యరావు (జనసేన), ఎస్‌.రాయవరం నల్లపరాజు వెంకటరాజు (టీడీపీ), మత్తి సౌజన్య (జనసేన), అనకాపల్లి- బొడ్డపాటి నారాయణమ్మ (జనసేన), మద్దాల వెంకటేశ్‌(టీడీపీ), అచ్యుతాపురం- ద్వారపురెడ్డి బాపు (జనసేన), రాజాన సన్యాసినాయుడు (బీజేపీ) ఎన్నికయ్యారు.

చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. వైస్‌ ఎంపీపీ ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఎంపీపీల విషయానికి వస్తే.. చోడవరం- గూనూరు మల్లునాయుడు (టీడీపీ), బుచ్చెయ్యపేట- గేదెల సత్యనారాయణ (టీడీపీ), రోలుగుంట- పంచాడ రజని (టీడీపీ), రావికమతం ఎంపీపీగా రాజాన శ్రీవాణి (టీడీపీ) ఎన్నికయ్యారు.

మునగపాకలో లాటరీ.. వైసీపీని వరించిన అదృష్టం

మునగపాక మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు వుండగా.. కూటమి, వైసీపీలకు చెరో ఎనిమిది స్థానాలు వచ్చాయి. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీపీ పదవికి జనసేన నుంచి దొడ్డి భారతి, వైసీపీ నుంచి మొల్లేటి శంకర్‌ పోటీ పడ్డారు. ఇద్దరికీ చెరో ఎనిమిది మంది సభ్యులు మద్దతు తెలపడంతో అధికారులు లాటరీ నిర్వహించారు. ఇందులో శంకర్‌ పేరు రావడంతో ఆయనను ఎంపీపీగా ప్రకటించారు. తరువాత నిర్వహించిన వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి తరపున (జనసేన) దొడ్డి భారతి పేరును ప్రతిపాదించగా, వైసీపీ నుంచి ఎవరి పేరును ప్రతిపాదించలేదు. దీంతో వైస్‌ ఎంపీపీగా భారతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

Updated Date - Nov 20 , 2026 | 01:08 AM