Share News

208 అంగన్‌వాడీలకు అసంపూర్తి భవనాలు

ABN , Publish Date - May 13 , 2026 | 12:56 AM

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 208 అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.11 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె రావికమతంలో నిర్వహించిన కిశోరి వికాసం కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయన్నారు.

208 అంగన్‌వాడీలకు అసంపూర్తి భవనాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సూర్యలక్ష్మి

రూ.11 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు

236 కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సూర్యలక్ష్మి

రావికమతం, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 208 అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.11 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె రావికమతంలో నిర్వహించిన కిశోరి వికాసం కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయన్నారు. కొన్ని కేంద్రాల్లో ఖాళీగా వున్న 236 కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసినట్ట చెప్పారు. ఖాళీగా వున్న 24 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 7,383 మంది గ ర్భిణులు, 6,662 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జూన్‌ తొమ్మిదో తేదీ వరకు కిశోర/ కిశోరి వికాసం పేరుతో బాలబాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, పోషకాహారం ఆవశ్యతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో వున్న బాలికలను 15 నుంచి 20 మందిని గ్రూపుగా ఏర్పాటు చేసి మంగళ, శుక్రవారాల్లో ఉదయం అమ్మాయిలకు, సాయంత్రం అబ్బాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో వి.మంగతాయారు, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.రమేశ్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:57 AM