ట్రాఫిక్ ఉల్లంఘనలపై 2,046 కేసులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:10 AM
నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు, మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధంగా వాహనాలను నడిపిన 2,046 వారిపై కేసులు నమోదుచేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.
అందులో ఓవర్‌స్పీడ్‌పైనే 222 కేసులు
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు, మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధంగా వాహనాలను నడిపిన 2,046 వారిపై కేసులు నమోదుచేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదుచేసి జరిమానా విధిస్తున్నామన్నారు. ఈ నెల మూడో తేదీన హెల్మెట్ ధరించని వారిపై 1,008 కేసులు, పిలియన్ రైడర్ (బైక్ వెనుక కూర్చున్నవారు) హెల్మెట్ ధరించకపోవడంపై 188 కేసులు, ట్రిపుల్ రైడింగ్‌పై 73 కేసులు, ఓవర్‌స్పీడ్ (లేజర్‌గన్స్ సహాయంతో)కు 222 కేసులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై 16 కేసులు, నోపార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలిపినందుకు 119, ఎంవీయాక్ట్ ఉల్లంఘనపై 365, ఇతర ఉల్లంఘనపై మరికొందరిపై కేసులు నమోదుచేసి, జరిమానా విధించామన్నారు. ఇకపై స్పీడ్ డ్రైవింగ్, నోపార్కింగ్ ఉల్లంఘనలపై మరింతగా దృష్టిసారిస్తామన్నారు.