Share News

200 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:41 PM

మండలంలోని సీతగుంట పంచాయతీ రోగులపేట జంక్షన్‌ వద్ద గురువారం మధ్యాహ్నం 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీ అయ్యారని జి.మాడుగుల సీఐ ఎస్‌.లక్ష్మణరావు, ఎస్‌ఐ టి.వెంకటేష్‌ తెలిపారు.

200 కిలోల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది.

ఐదుగురి అరెస్టు.. ఇద్దరి పరారీ

ఆటో, ద్విచక్రవాహనం సీజ్‌

పెదబయలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సీతగుంట పంచాయతీ రోగులపేట జంక్షన్‌ వద్ద గురువారం మధ్యాహ్నం 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీ అయ్యారని జి.మాడుగుల సీఐ ఎస్‌.లక్ష్మణరావు, ఎస్‌ఐ టి.వెంకటేష్‌ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. గంజాయిని ఒడిశా నుంచి పెదబయలు మీదుగా మైదానప్రాంతాలకు తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌కు చెందిన ధూళిపుట్టు గ్రామానికి చెందిన భగవాన్‌ తంబారి, అల్లూరి జిల్లా పెదబయలు మండలానికి చెందిన కిల్లో సుబ్బారావు, కొర్ర రాంబాబు, కొర్ర లక్ష్మణరావు, కొర్ర బాబురావులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీ అయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Sep 17 , 2026 | 11:41 PM