Share News

18,29,966 ... ఇదీ జీవీఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:46 AM

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగుపడింది.

18,29,966 ... ఇదీ జీవీఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య

9,02,171 మంది పురుషులు, 9,27,676 మంది మహిళలు, 119 మంది ఇతరులు

వార్డుల వారీగా జాబితాల విడుదల

నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగుపడింది. గ్రేటర్‌ పరిధిలోని 120 వార్డుల్లో ఓటర్ల జాబితాలను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెప్టెంబరు 23 నుంచి 25 వరకు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సర్వే సిబ్బందికి పూర్తి సమాచారం ఇవ్వడం ద్వారా సహకారం అందించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో 18,29,966 మంది ఓటర్లు ఉన్నట్టు కమిషనర్‌ తెలిపారు. వీరిలో 9,02,171 మంది పురుషులు కాగా, 9,27,676 మంది మహిళలు, 119 మంది ఇతరులు ఉన్నారు. భీమిలి జోన్‌ పరిధిలోని ఐదు వార్డుల్లో 66,446 మంది, మధురవాడ జోన్‌లోని ఏడు వార్డుల పరిధిలో 1,49,452 మంది, ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని 18 వార్డుల్లో 2,96,124 మంది, సౌత్‌ జోన్‌ పరిధిలోని 16 వార్డుల్లో 2,17,817 మంది, నార్త్‌ జోన్‌ పరిధిలోని 20 వారుల్లో 2,91,691 మంది, వెస్ట్‌ జోన్‌ పరిధిలోని 17 వార్డుల్లో 2,14,094 మంది, గాజువాకజోన్‌ పరిధిలోని 19 వార్డుల్లో 2,98,229 మంది, అగనంపూడి జోన్‌ పరిధిలోని ఐదు వార్డుల్లో 69,796 మంది, అనకాపల్లి జోన్‌ పరిధిలోని ఆరు వార్డుల్లో 76,950 మంది, పెందుర్తి జోన్‌ పరిధిలోని ఏడు వార్డుల్లో 1,49,367 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:46 AM