రెండో విడత పంచాయతీ బరిలో 1,767 మంది
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:09 AM
జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులకు 452 మంది, వార్డు సభ్యులుగా 1,315 మంది... మొత్తం 1,767 మంది బరిలో నిలిచారు.
సర్పంచులుగా 452 మంది, వార్డు సభ్యులుగా 1,315 మంది
మొత్తం 880 వార్డులకు 350 ఏకగ్రీవం కాగా, 527 వార్డులకే ఎన్నికలు
అభ్యర్థుల తుది జాబితా విడుదల
29న ఎన్నికలు
పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులకు 452 మంది, వార్డు సభ్యులుగా 1,315 మంది... మొత్తం 1,767 మంది బరిలో నిలిచారు. ఈ నాలుగు మండలాల్లోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి కావడంతో బరిలో ఉండే సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీల్లో సర్పంచులకు 690, అలాగే 880 వార్డులకు 1,645 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఉపసంహరణ ప్రక్రియ అనంతరం మొత్తం 87 పంచాయతీలకు 452 మంది పోటీలో ఉండగా, మొత్తం 880 వార్డుల్లో 1,645 నామినేషన్లకు 330 తిరస్కరణ/ఉపసంహరణ కాగా, 1,315 బరిలో ఉన్నట్టు డీపీవో కేపీ.చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్ తెలిపారు. అలాగే రెండో విడత ఈ నెల 29న ఎన్నికలు జరిగే ముంచంగిపుట్టులో 38,895 మంది, పెదబయలులో 43,322, అనంతగిరిలో 38,286, జి.మాడుగులలో 44,674 మంది ఓటర్లు ఉన్నారు.