Share News

170 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - May 29 , 2026 | 10:39 PM

ఒడిశా నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 170 కిలోల గంజాయిని పట్టుకుని నలుగురి నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

170 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి నిందితులతో పోలీసులు, ఎస్‌ఐ సురేశ్‌ కుమార్‌

నలుగురి అరెస్టు

కారు, ద్విచక్రవాహనం సీజ్‌

గూడెంకొత్తవీధి, మే 29 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 170 కిలోల గంజాయిని పట్టుకుని నలుగురి నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఎస్‌ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి.

ముందస్తు సమాచారంతో మండల కేంద్రంలోని పాతవీధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి వైపు వెళుతున్న ఓ కారు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న చిత్తూరుకి చెందిన దామోదరం, రాజానగర్‌కి చెందిన సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, జీకేవీధికి చెందిన మార్కు అలియాస్‌ సిద్ధులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 170 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చింతపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది, వీఆర్వో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 10:39 PM