Share News

165 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:03 AM

165 కిలోల గంజాయి స్వాధీనం

 165 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో ఎస్‌ఐ వెంకటేశ్‌, సిబ్బంది.

ఫొటోరైటప్‌ః30పీబీఎల్‌1ః

- ఐదుగురి అరెస్టు

పెదబయలు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆటోలో తరలిస్తున్న 165 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మంగళవారం సీతగుంట పంచాయతీ రోగులపేట కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అటుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనచోదకుడు గంజాయి రవాణాకు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడని తేలింది. అతనిని అదుపులోకి తీసుకుని వెనుక వస్తున్న ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఆటోలో గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించి రెవెన్యూ సిబ్బంది సమక్షంలో తూకం వేశారు. నాలుగు గోనె సంచుల్లో 165 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా పొట్టంగి బ్లాక్‌కు చెందిన నబిన్‌ ఖరా, కేసు ఖరా, సునీల్‌ సీందేరి, బిసమా గెమెలా, సల్మాన్‌ సీందేరిగా గుర్తించారు. వారు ఈ గంజాయిని ఒడిశా చిత్రకొండ ప్రాంతం నుంచి పెదబయలు మీదుగా కోరాపుట్‌ జిల్లాకు తరలిస్తున్నారని విచారణలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ఆటో, ద్విచక్రవాహనంతోపాటు వారి సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 01 , 2026 | 12:04 AM