విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్‌కు 15 వినతులు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:15 PM
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ టి.నిషాంతి 15 వినతులను స్వీకరించారు.
పాడేరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ టి.నిషాంతి 15 వినతులను స్వీకరించారు. జిల్లాలో దివ్యాంగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, వారికి అవసరమైన పరికరాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో సోమవారం కలెక్టరేట్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగుల నుంచి వచ్చిన 15 వినతులను ఆమె స్వీకరించారు. అనంతరం పలువురు దివ్యాంగులకు వీల్‌చైర్లను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఏడీ కె.కవిత, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.