12,28,247... 642 పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య ఇది
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:21 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఓటర్ల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు.
పురుషులు: 5,98,956
మహిళలు: 6,29,274
ఇతరులు: 17
ప్రజలకు అందుబాటులో తుది జాబితాలు
రాంబిల్లి మండలంలో నాలుగు పంచాయతీలు పెండింగ్
కోర్టు కేసులే కారణం
అనకాపల్లి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఓటర్ల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. మొత్తం 646 గ్రామ పంచాయతీలు వుండగా వీటిలో 642 పంచాయతీలకు సంబంధించి ఓటరు జాబితాలను అధికారులు ప్రకటించారు. ఈ పంచాయతీల్లో 6,256 వార్డుల్లో 12,28,247 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,98,956 మంది పురుషులు, 6,29,274 మంది మహిళలు, 17 మంది ఇతరులు వున్నారు. పురుషులతో పోలిస్తే, మహిళా ఓటర్లు 30,318 మంది అధికంగా ఉన్నారు.
ఆ నాలుగు పంచాయతీలు మినహా...
జిల్లాలో 646 గ్రామ పంచాయతీలకుగాను 642 పంచాయతీలకు మాత్రమే తుది ఓటరు జాబితాలను విడుదల చేశారు. ఈ నాలుగు పంచాయతీలు రాంబిల్లి మండలంలో వున్నాయి. ఇక్కడ 30 పంచాయతీలు ఉండగా 26 పంచాయతీల జాబితాలను విడుదల చేశారు. కోర్టు కేసులు తేకపోవడంతో అప్పారాయుడుపాలెం, ఎం.చింతువ, పంచదార్ల, జడ్.చింతువ పంచాయతీల ఓటరు జాబితాలను పెండింగ్‌లో పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ నాలుగు పంచాయతీల్లో పోలింగ్ జరపలేదు.
అనకాపల్లిలో అత్యధికం
మండలాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 81,568 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 39,434 మంది పురుషులు, 42,132 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. తరువాత పాయకరావుపేట మండలంలో 79,851 మంది, చోడవరం మండలంలో 72,986 మంది, నక్కపల్లి మండలంలో 66,206 మంది, అచ్యుతాపురం మండలంలో 63,003 మంది ఓటర్లు వున్నారు.
నర్సీపట్నంలో అత్యల్పం
నర్సీపట్నం మండలంలో అత్యల్పంగా 23,962 మంది ఓటర్లు వున్నారు. తరువాత ఎలమంచిలి మండలంలో 20,422 మంది, చీడికాడ మండలంలో 36,784 మంది, రాంబిల్లి మండలంలో 35,519 మంది, రోలుగుంట మండలంలో 37,950 మంది ఓటర్లు వున్నారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు...
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
అనకాపల్లి 39,434 42,132 2 81,568
అచ్యుతాపురం 30,825 32,178 - 63,003
బుచ్చెయ్యపేట 25,480 26,757 1 52,238
చీడికాడ 17,896 18,888 - 36,784
చోడవరం 35,630 37,353 3 72,986
దేవరాపల్లి 23,025 24,224 1 47,250
గొలుగొండ 20,253 21,359 - 41,612
కశింకోట 27,212 29,376 1 56,589
కె.కోటపాడు 24,092 25,246 - 49,338
కోటవురట్ల 21,813 22,837 - 44,650
మాకవరపాలెం 22,875 24,110 - 46,985
మునగపాక 22,475 23,241 - 47,716
నక్కపల్లి 32,875 33,331 - 66,206
నాతవరం 25,365 26,416 - 51,781
నర్సీపట్నం 11,577 12,384 1 23,962
పరవాడ 22,103 22,822 1 44,926
పాయకరావుపేట 39,674 40,177 - 79,851
రాంబిల్లి 17,257 18,262 - 35,519
రావికమతం 27,149 28,855 - 56,004
రోలుగుంట 18,196 19,751 3 37,950
సబ్బవరం 26,514 27,822 1 54,337
ఎస్.రాయవరం 29,944 32,086 2 62,032
వి.మాడుగుల 27,473 29,064 1 56,538
ఎలమంచిలి 9,819 10,603 - 20,422
మొత్తం 5,98,956 6,29,274 17 12,28,247