1,108 కిలోల గంజాయి దహనం
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:42 AM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకున్న 1,108 కిలోల గంజాయిని సోమవారం ఫార్మాసిటీలో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు.
ఫార్మా సిటీలో శాస్ర్తీయ పద్ధతిలో ప్రక్రియ
పరవాడ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) :
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకున్న 1,108 కిలోల గంజాయిని సోమవారం ఫార్మాసిటీలో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. తొలుత ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ పంకజ్‌కుమార్ ద్వివేది, సూపరింటెండెంట్ రాజన్‌కుమార్, లీగల్ ఎస్పీ నగేశ్‌బాబు గంజాయి దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. తమ తనిఖీల్లో పట్టుకున్న గంజాయి, ఇతర మత్తుపదార్థాలను న్యాయస్థానాల అనుమతితోనే శాస్త్రీయ పద్ధతిలో దహనం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీబీ ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్‌బాబు, ఈగల్ ఇన్‌స్పెక్టర్లు కల్యాణి, ధనుంజయనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.