Share News

10.52 లక్షలు... ఇవీ జిల్లాలో గృహాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:56 AM

జనగణనలో భాగంగా గృహగణన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది.

10.52 లక్షలు... ఇవీ జిల్లాలో గృహాలు

జనాభా 27.16 లక్షలు

గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో అత్యధికం

ముగిసిన గృహగణన

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జనగణనలో భాగంగా గృహగణన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ మేరకు జిల్లాలోని 10,52,785 ఇళ్లల్లో 27,16,794 జనాభా ఉన్నట్టు తేలింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటింటా జనగణన చేపడతారు.

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లోని 85 రెవెన్యూ గ్రామాల్లో 82,247 ఇళ్లు ఉంటాయని అంచనావేయగా క్షేత్రస్థాయిలో గృహగణన పూర్తయ్యేసరికి 82,664 ఇళ్లు ఉన్నాయని గుర్తించారు. ఈ గృహలలో 2,07,699 మంది జనాభా ఉంటారనే అంచనాతో చేపట్టిన గృహగణనలో 2,15,796 మంది ఉన్నట్టు నిర్ధారించారు. గృహగణన ముగిసే సమయానికి 103.90 శాతం లక్ష్యం పూర్తయింది. పద్మనాభం మండలంలో 51,397 మంది, భీమిలిలో 50,194, ఆనందపురంలో 75,376 మంది, పెందుర్తిలో 38,829 మంది జనాభా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న పది జోన్‌లలో 9,70,123 ఇళ్లల్లో 25,00,698 మంది జనాభా ఉన్నారు. గృహగణన ప్రారంభమయ్యే సమయానికి 9,58,211 ఇళ్లల్లో 24,70,527 మంది జనాభా ఉంటారని అంచనావేశారు. క్షేత్రస్థాయిలో గృహగణన పూర్తిచేసేసరికి 9,70,123 ఇళ్ల్లల్లో 25,00,698 మంది ఉన్నారని గుర్తించారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్‌ వెళ్లి ఇంటి వివరాలతోపాటు ఇంట్లో జనాభా సంఖ్య, ఇంట్లో ఏయే వస్తువులున్నాయి? అనే వివరాలు సేకరించారు. నగరంలో గాజువాక జోన్‌లో అత్యధికంగా 4,20790 జనాభా ఉండగా, విశాఖ తూర్పులో 3,86,865 మంది జనాభా ఉన్నారు. అంచనా కంటే విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, విశాఖ పశ్చిమ, అగనంపూడి, అనకాపల్లిలో ఇళ్ల సంఖ్య, జనాభా తక్కువగా ఉంది. మధురవాడలో 47.06 శాతం, గాజువాకలో అంచనా కంటే 27.34శాతం ఎక్కువ జనాభా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని గాజువాక, మధురవాడ, విశాఖ ఉత్తర, పెందుర్తి, విశాఖ తూర్పులో జనాభా ఎక్కువగా నివసిస్తున్నారు. ముగిసిన గృహగణన వివరాల మేరకు వచ్చే ఏడాది ప్రతి ఇంటికీ వెళ్లి జనగణన చేపడతారు.

ఇళ్లు, జనాభా వివరాలు

జోన్‌ అంచనా ఇళ్ల సంఖ్య మొత్తం ఇళ్లు అంచనా జనాభా మొత్తం జనాభా

భీమునిపట్నం 35,729 35,935 94,671 95,106

మధురవాడ 1,17,006 1,21,021 1,96,610 2,89,140

విశాఖ తూర్పు 1,43,229 1,44,256 3,69,959 3,86,865

విశాఖ ఉత్తర 1,34,591 1,34,738 4,08,885 3,62,311

విశాఖ దక్షిణ 93,673 94,665 3,03,068 2,42,102

విశాఖ పశ్చిమ 1,09978 1,10,807 3,11,131 2,87,696

పెందుర్తి 80,675 83,620 1,71,221 2,18,026

గాజువాక 1,61,161 1,61,148 403024 4,20,790

అగనంపూడి 41377 43854 107650 1,01,623

అనకాపల్లి 40092 40079 104318 9,7039

మొత్తం 9,58,211 9,70,123 24,70,427 25,00,698

Updated Date - Jun 08 , 2026 | 12:56 AM