విశాఖకు రీజియన్‌కు 100 అద్దె బస్సులు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:37 AM
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు త్వరలో వంద అద్దె బస్సులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,450 అద్దె బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారైన వెంటనే ప్రస్తుతం ఉన్న డిమాండ్, సగటు ఆక్యుపెన్సీ రేషియో, నిర్వాహణ సామర్థ్యం ఆధారంగా జిల్లాలకు అద్దె బస్సులు కేటాయించనున్నది.
రెండు దశల్లో రాక
ద్వారకా బస్‌స్టేషన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు త్వరలో వంద అద్దె బస్సులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,450 అద్దె బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారైన వెంటనే ప్రస్తుతం ఉన్న డిమాండ్, సగటు ఆక్యుపెన్సీ రేషియో, నిర్వాహణ సామర్థ్యం ఆధారంగా జిల్లాలకు అద్దె బస్సులు కేటాయించనున్నది. వాటి ఆధారంగా విశాఖ రీజియన్‌కు వంద బస్సులు ఇవ్వనున్నట్టు రీజనల్ అధికారులకు సమాచారం అందింది. ఇవి రెండు దశల్లో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే విశాఖ జిల్లాలోనే ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉంది. స్త్రీశక్తి, దివ్యాంగశక్తి అమలు తరువాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు లేవని రీజనల్ అధికారులు గతంలోనే ప్రధాన కార్యాలయానికి నివేదించారు. స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలకు సంబంధించిన ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో బస్సులు ఎక్కువగా కావాలని కోరారు. ఇందుకు ప్రధాన కార్యాలయం కూడా ఆమోదించిందని విశాఖ రీజియన్ అధికారులు తెలిపారు.