Share News

100 కేజీలు గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:46 AM

మండలంలోని లబ్బూరు సమీపంలో జంక్షన్‌ వద్ద శనివారం పోలీసులు వంద కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

100 కేజీలు గంజాయి పట్టివేత
పట్టుకున్న గంజాయి, ఇద్దరు స్మగ్లర్లతో పోలీసులు

ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

ముంచంగిపుట్టు, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని లబ్బూరు సమీపంలో జంక్షన్‌ వద్ద శనివారం పోలీసులు వంద కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

గంజాయి రవాణా జరుగుతున్నట్టు ముంచంగిపుట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఎస్‌ఐ పి.నాని ఆధ్వర్యంలో పోలీసులు లబ్బూరు జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒడిశా నుంచి ఆంధ్రా వైపు వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో ప్లాస్టిక్‌ సంచుల్లో ఉన్న వంద కిలోల గంజాయిని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని సీఐ లక్ష్మణరావు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లు ఒడిశా వాసులుగా విచారణలో వెల్లడైందని ఆయన తెలిపారు. ఈ గంజాయి రవాణా వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మణరావు చెప్పారు.

Updated Date - Jul 12 , 2026 | 12:46 AM